గోంగూర పుల్లకూర

మిక్స్‌డ్ దాల్స్ దోశె

ఎగ్ బిర్యానీ

టమాటా పలావ్‌

పాల చాక్లెట్;

ఉగాది పచ్చడి;

నూర్‌మహల్ పులావ్

నూర్‌మహల్ పులావ్ కావలసినవి 

బాస్మతి బియ్యం - 2 కప్పులు
గరంమసాలా - టీ స్పూను
నూనె - 4 టేబుల్ స్పూన్లు
బిరియానీ ఆకు - 1
ఉప్పు - తగినంత
దాల్చినచెక్క - చిన్న ముక్క
చీజ్ - అరకప్పు, లవంగాలు - 6 క్రీమ్ - 3 స్పూన్లు
జీలకర్ర - టీ స్పూను
కుంకుమపువ్వు - కొద్దిగా
ఏలకులు - 8
పాలకూర రసం - 2 టేబుల్ స్పూన్లు
బటర్ - 2 టేబుల్ స్పూన్లు ఉల్లితరుగు - పావుకప్పు
వెల్లుల్లి పేస్ట్ - 2 టేబుల్ స్పూన్లు కొత్తిమీరతరుగు - 2 టేబుల్ స్పూన్లు

నూర్‌మహల్ పులావ్ తయారి

బియ్యాన్ని శుభ్రంగా కడిగి అరగంటసేపు నానబెట్టాలి. బాణలిలో నూనె వేసి కాగాక బిరియానీ ఆకు, దాల్చినచెక్క, లవంగాలు, జీలకర్ర, ఏలకులు వేసి సన్నని మంట మీద వేయించాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్  , గరంమసాలా వేసి కొద్దిగా వేయించాలి. నానబెట్టుకున్న బియ్యం వేసి నాలుగైదు నిముషాలు కలిపి, అందులో నీరు, ఉప్పు వేసి సన్ననిమంట మీద ఉడికించాలి. ఒక చిన్న బౌల్‌లో చీజ్‌తురుము, క్రీమ్, ఉప్పు వేసి కలపాలి. దీనిని మూడు భాగాలుగా చేసి ఒక భాగాన్ని పాలు, కుంకుమపువ్వు ఉన్న బౌల్‌లో వేయాలి. ఒక భాగం పాలకూర రసంలో వేయాలి. మూడవ భాగాన్ని చిన్నచిన్న ఉండలుగా చేసి నూనెలో వేయించాలి. (వీటినే నూర్ మహల్ అంటారు) ఒక పెద్దపాత్రలో అన్నం ఉడకగానే చీజ్ బాల్స్ లేదా నూర్‌మహల్ వేసి, కొత్తిమీరతో గార్నిష్ చేసి వేడివేడిగా సర్వ్ చేయాలి.

పాలక్ కార్న్


పాలక్ కార్న్ కావలసినవి

ఉడికించిన కార్న్ - 50 గ్రా.
ఉడికించిన పాలకూర - 250 గ్రా.
పచ్చిమిర్చి - 10
ఉల్లితరుగు - 10 గ్రా.
క్రీమ్ - టేబుల్ స్పూను
అల్లంతరుగు - 10 గ్రా.
వెల్లుల్లి తరుగు - 10 గ్రా.
మిరప్పొడి - 10 గ్రా.
ఉప్పు - తగినంత
పసుపు - చిటికెడు, నూనె - 25 గ్రా.
గరంమసాలా పొడి - 5 గ్రా.

పాలక్ కార్న్ తయారి

ఒక గిన్నెలో పాలకూర తరుగు, పచ్చిమిర్చి తరుగు, కొద్దిగా ఉప్పు వేసి ఉడికించి, చల్లారాక మిక్సీలో వేసి పేస్ట్ చేయాలి.బాణలిలో నూనె వేసి కాగాక అల్లం తరుగు, వెల్లుల్లి తరుగు వేసి కొద్దిగా వేగాక ఉల్లితరుగు వేసి గోధుమరంగు వచ్చేవరకు వేయించాలి. పచ్చిమిర్చి, ఉప్పు, పసుపు, గరంమసాలా వేసి కలిపి, ఉడికించిన కార్న్, పాలకూర వేసి నాలుగైదు నిముషాలు ఉడికించాలి.

అరటిపండు ఐస్‌క్రీమ్‌

అరటిపండు ఐస్‌క్రీమ్‌   కావలసిన పదార్థాలు

పాలు - 1 లీటర్‌,
అరటిపండ్లు - 6
ఐస్‌క్రీమ్‌ పౌడర్‌ - 60 గ్రాములు
క్రీమ్‌ - అర కిలో,
పంచదార - 200 గ్రాములు

అరటిపండు ఐస్‌క్రీమ్‌ తయారీ విధానం
       పాలను కాగబెటి, స్టౌమీద నుండి దించకుండా సిమ్‌లో పెట్టి మరగనివ్వాలి. ఒక కప్పు చల్లటి పాలలో ఐస్‌ క్రీమ్‌ పౌడర్‌ను ఉండలు కట్టకుండా కలిపి మరుగుతున్న పాలల్లో పొయ్యాలి. ఇందులోనే పంచదార, క్రీమ్‌, మిక్సీ పట్టిన అరటిపండ్ల గుజ్జు కలిపి మరి కాసేపు వేడి చేయాలి. ఈ పాల మిశ్రమం చిక్కబడిన తర్వాత చల్లార్చి ఫ్రీజర్‌లో పెట్టాలి. గడ్డ కట్టిన తర్వాత తీసి మెత్తగా మిక్సీ వేయాలి. మళ్లీ ఈ మిశ్రమాన్ని ఫ్రీజర్‌లో పెట్టాలి. గడ్డ కట్టిన ఐస్‌క్రీమ్‌ని మళ్లీ మెత్తగా గ్రైండ్‌ చేయాలి. మెత్తగా నురగలు తేలుతున్న ఐస్‌క్రీమ్‌ను అరగంట ఫ్రిజ్‌లో పెట్టి తింటే రుచిగా ఉంటుంది.

కోవా కొవ్వొత్తులు


కోవా కొవ్వొత్తులు కావలసిన పదార్థాలు

పాలు - 2 కప్పులు
పంచదార - 2 కప్పులు
మొక్కజొన్న పిండి - అరకప్పు
మైదాపిండి - అరకప్పు
బియ్యం పిండి - అరకప్పు
జీడిపప్పు ముద్ద - పావుకప్పు
నెయ్యి - అరకప్పు
యాలకుల పొడి - 1 స్పూన్‌
మిఠాయి రంగులు - రెండు /మూడు


కోవా కొవ్వొత్తులు తయారీ విధానం

బాండీలో పచ్చిపాలు, పంచదార, మైదా, బియ్యంపిండి, మొక్కజొన్న పిండి కలపాలి. సన్నసెగమీద ఉడికిస్తూ మధ్య మధ్యలో కలియబెడుతూ ఉండాలి. ఈ మిశ్రమం దగ్గర పడుతున్నప్పుడు జీడిపప్పు ముద్ద, యాలకుల పొడి కలపాలి. ఈ మిశ్రమానికి రెండు మూడు రంగులు వేయాలనుకుంటే భాగాలుగా చేసి ఒక్కో భాగానికి ఇష్టమైన రంగులు వచేసుకుని కొవ్వొత్తి ఆకారంలో చేసుకోవచ్చు.

HAPPY SANKRANTHI


HAPPY SANKRANTHI TO ALL ANDHRAKITCHEN VIEWERS............................